లిబియా రాజధాని ట్రిపొలిలో రెండు సాయుధవర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 9 మంది మరణించగా.. 16 మంది గాయపడ్డారు. బషీర్ ఖల్ఫల్లా (అల్ బక్రా) వర్గానికీ, అల్ షహీదా సబ్రియా వర్గానికీ మధ్య శుక్రవారం గంటల తరబడి ఘర్షణలు జరిగాయి. అల్ బక్రాపై శుక్రవారం జరిగిన హత్యాయత్నానికి అల్ షహీదా వర్గమే కారణమనే ఆరోపణ ఈ పోరుకు దారి తీసింది.