టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.40 వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో టీసీఎస్ ద్వారా 10 వేల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు.