ప్రధాని మోదీ దగ్గర ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలన్నా కచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడించారు. మోదీ డిమాండింగ్ బాస్ అని.. ఆయన దగ్గర నుంచి ప్రతిరోజూ తనకు ప్రశంసలు వస్తూనే ఉంటాయన్నారు. తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండి ఏం చేయడానికైనా మోదీ సిద్ధమవుతారన్నారు. పూర్తిస్థాయిలో అందరికీ ఫ్రీడమ్ ఇస్తారని.. అందుకే ఆయనతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నారు.