ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు అక్కడి నుంచే సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడం సహా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బృందం ఆస్ట్రేలియా వెళ్లి స్పోర్ట్స్ యూనివర్సిటీపై అధ్యయనం చేయనుంది.