కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలలో యాంటీ మైక్రోబెల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. రోజుకొక కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది. అలాగే ఇది వెంట్రుకలు రాలకుండా సహాయపడుతుంది. రోజూ ఉదయం ఒకగ్లాస్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. చర్మానికి కొబ్బరి పాలు సహజ మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి.