దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌పై కాగ్నింజెంట్ కోర్టులో దావా వేసింది. తమ హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ.. కాగ్నిజెంట్ అనుబంధ సంస్థ ట్రైజెట్టో టెక్సాస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. కాగ్నిజెంట్ డేటాబేస్‌ను ఇన్ఫోసిస్ అక్రమంగా యాక్సెస్ చేసి తమకు పోటీ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ ఆరోపణలను ఇన్ఫోసిస్ ఖండించింది. చట్ట ప్రకారం ఎదుర్కొంటామని తెలిపింది.