మావోయిస్టు పార్టీలో ఇప్పుడున్న సభ్యులు తప్ప, కొత్త రిక్రూట్మెంట్లు లేవు. భద్రతా బలగాలు టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులను ఏరివేస్తున్నాయి. గతంలో మావోయిస్టులు ఏదైనా చర్యలకు పాల్పడితేనే భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించేవి. ఇప్పుడు నిరంతరాయంగా కూంబింగ్ కొనసాగుతోంది. వారు ఆయుధాలు, డబ్బులు సేకరించే మార్గాలతో పాటు వారికి ఉన్న అన్ని దారులను మూసివేశాయి. ఫలితంగా మావోెయిస్టుల బలం తగ్గింది.