ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే మండల లోక్‌సభ స్థానంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లు దేశాన్ని పాలించి, గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు.