హర్యానాలోని అన్ని స్థానాల్లో పోటీ: జేజేపీ

53చూసినవారు
హర్యానాలోని అన్ని స్థానాల్లో పోటీ: జేజేపీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్, హర్యానా మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ-జేజేపీ కూటమితో పొత్తు ముగిసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. సొంతంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.