తెలంగాణ వైద్య విధాన పరిషత్, హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన 64 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ/డీఎన్బీతో పాటు పని అనుభవం తప్పనిసరి. ఆఫ్లైన్ దరఖాస్తులను ‘ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎస్ అండ్ ఐ), ఖైరతాబాద్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 26-11-2024. వివరాలకు https://hyderabad.telangana.gov.in ను చూడొచ్చు.