రైతులు దొండకాయ సాగుతో నిలకడైన ఆదాయాన్ని ఏడాది పొడవునా పొందవచ్చు. ఇక దొండ సాగుకు నీరు నిలవని అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. మంచి మెళకువలు పాటిస్తే మంచి లాభాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ దొండ కాయ సాగుకి సంబంధించి రైతులు మొక్కలను పొలంలో నాటుకుని దానికి మంచి పందిరి వేయాలి. ఇలా కాండం వేసి సాగు చేయడం ద్వారా చేసిన పంటకి మూడు ఏళ్ల వరకు దిగుబడి అనేది అధికంగా పొందవచ్చు.