నీరింకే అన్ని నేలలు గోంగూరు సాగుకు అనుకూలం. నల్లరేగడిలో బాగా పండుతుంది. ఎకరాకు 15-20 కిలోల విత్తనాలు అవసరం. ఎకరాలో సాగుకు రూ.12 వేలు ఖర్చవుతుంది. విత్తిన తర్వాత రెండు నెలలకు పంట చేతికొస్తుంది. ఆరు నెలలు దిగుబడి మెరుగ్గా ఉంటుంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి లభించి మంచి ఆదాయం సమకూరుతుంది.