దాసరి చాలామంది టాప్ స్టార్స్‌తో సినిమాలు తీశారు. నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి” చిత్రాలన్నీ శతదినోత్సవాలు చూశాయి. వాటిలో ‘సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి” బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. యన్టీఆర్‌తో దాసరి తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ నటరత్న నటనా వైభవం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది.