ఈ ఫార్మాలా రేస్‌లో కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి రాగానే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్‌పై అమిత్ షాతో చర్చించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లరనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. పీసీ యాక్ట్ 17ఏ కింద కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్‌ను కోరగా.. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయం కోరారు జిష్ణు దేవ్. ఈ నేపథ్యంలోనే మరో రెండు వారాల్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.