ఈడీ తీరుపై ఢిల్లీ మంత్రి ఫైర్‌

75చూసినవారు
ఈడీ తీరుపై ఢిల్లీ మంత్రి ఫైర్‌
ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఝలక్‌ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. అసలు బెయిల్ ఉత్తర్వులు వెలువడకముందే ఈడీ ఏం సవాల్‌ చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత కక్షతో ఇదంతా చేస్తోందని దుయ్యబట్టారు.