నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, నెట్‌ఫ్లిక్స్‌లపై నటుడు ధనుష్ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. నయనతార - విఘ్నేష్ శివన్ దంపతులు.. తమ ప్రొడక్షన్ లో నిర్మించిన 'నానుమ్ రౌడీ తాన్' మూవీలోని సన్నివేశాలను అనుమతి లేకుండా వారి పెళ్లి డాక్యుమెంటరీలో ఉపయోగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది.