ఆ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయండి

62చూసినవారు
ఆ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయండి
కాంగ్రెస్‌లో చేరిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) శాసనమండలి సభ్యులు టీ భానుప్రసాద్‌, ఎంఎస్‌ ప్రభాకర్‌ రావు, దండే విఠల్‌, యెగ్గె మల్లేశంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి పిటిషన్‌ సమర్పించారు. వారిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారీ, ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, వాణిదేవి, శేరి శుభాష్‌రెడ్డి, ఎల్‌ రమణ, దేశపతి శ్రీనివాస్‌, రవీందర్‌రావు, తాతా మధుసూదన్‌, నవీన్‌ కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్