గర్భధారణ సమయంలో, స్త్రీలకు తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి రకరకాలుగా ఊహించుకుంటారు. కడుపులో పెరుగుతున్న శిశువు కడుపు లోపల ఏమి చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. శిశువు కూడా చాలా నేర్చుకుంటుంది. గర్భిణీ స్త్రీలు వారి దినచర్య, ప్రవర్తన, ఇతర విషయాలపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. కడుపులో ఉన్న బిడ్డ తల్లి స్పర్శ, స్వరాన్ని గుర్తించగలదు. తల్లికి ఉండే అలవాట్లు కొన్ని బిడ్డలకు కూడా సంక్రమిస్తాయి.