ఉత్తరాఖండ్‌లో ఎన్నో గోలు దేవత ఆలయాలు ఉన్నాయి. అయితే అల్మోరాలో ఉన్న చిటైస్ గోలు దేవత ఆలయం న్యాయ దేవతగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రజలు పోలీస్‌స్టేషన్‌లో అర్జీ పెట్టినట్లుగానే.. ఇక్కడి ఆలయంలోని దేవతకు లేఖ ద్వారా తమ కోరికను తెలియజేస్తారు. ఆలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో లేఖలు, గంటలు కనిపిస్తాయి. వెంటనే న్యాయం అందించే దైవంగా గోలు దేవతను స్థానికులు కొలుస్తారు.