ఆపరేషన్ భేదియా.. ప్రస్తుతం యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడిలో ఏడుగురు చిన్నారులు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగి, వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ భేదియాను చేపట్టారు. డ్రోన్లతో వాటి సంచారంపై నిఘా పెట్టి ఇప్పటివరకు 4 తోడేళ్లను అధికారులు బంధించగలిగారు. అయితే ఈ ప్రాంతంలో ఎన్ని తోడేళ్లు తిరుగుతున్నాయో స్పష్టంగా తెలియడం లేదని అధికారులు చెప్తున్నారు.