రైల్వే స్టేషన్‌ లేని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా?

79చూసినవారు
రైల్వే స్టేషన్‌ లేని ఏకైక రాష్ట్రం ఏదో తెలుసా?
మన దేశంలో దాదాపు 8 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటినా ఇప్పటికీ రైల్వే అనుసంధానం లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఈశాన్య భారతంలోని సిక్కిం రాష్ట్రం. ఇక్కడ సుమారు 6 లక్షల జనాభా నివసిస్తోంది. ఇతర రవాణా మార్గాలు ఉన్నప్పటికీ, రైల్వే మార్గం మాత్రం ఇక్కడ లేదు. ఇక్కడి ప్రజలు రైలులో వెళ్లాలంటే సమీప రాష్ట్రాలకు వెళ్లి ఎక్కుతుంటారు. ఎత్తైన కొండ ప్రాంతాల కారణంగా సిక్కింలో రైల్వే లైన్లు లేవు.

సంబంధిత పోస్ట్