బాదం మన ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించి కళ్ల కింద నల్లటి వలయాలను నయం చేయవచ్చు. బాదం నూనెతో ముఖాన్ని మసాజ్ చేసుకున్న ప్రయోజనం ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. బాదం ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడానికి 1/2 టీస్పూన్ బాదం పేస్ట్, 2-4 చుక్కల బాదం నూనె, 1 టీస్పూన్ పెరుగును ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం మీద అప్లై చేస్తే ముడతలు పోతాయి.