నేటి బిజీ లైఫ్‌లో చాలామంది ఉన్నట్టుండి అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు చాలా కాలంగా కొనసాగడం వల్ల మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఒక నెల రోజులపాటు బ్రేక్‌ఫాస్ట్‌ని నిరంతరం తీసుకోకపోతే, సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. ఫలితంగా చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు కూడా పెరుగుతాయి. అంతేకాదు గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.