ఓ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. ఎడమ కన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. గ్రేటర్ నోయిడాలోని బీటా 2 పిఎస్ పరిధిలోని సెక్టార్ గామా 1లో ఉన్న ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆపరేషన్ అనంతరం డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోగానే పిల్లాడిని కుటుంబ సభ్యులు గమనించారు. ఎడమ కంటికి కాకుండా కుడికంటికి ఆపరేషన్ చేసినట్లు గుర్తించారు. దీంతో బాధితులు ఈ విషయమై సీఎంఓకు ఫిర్యాదు చేశారు.