నారాయణ్ జగదీశన్ డబుల్ సెంచరీ

53చూసినవారు
నారాయణ్ జగదీశన్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీశన్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కోయంబత్తూరులో చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో డబుల్ సెంచరీ. గతంలో రైల్వేస్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జగదీశన్ 245 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ ట్రోఫీ సీజన్‌లో కనీసం రెండు డబుల్ సెంచరీలు చేసిన తమిళనాడు నుంచి మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you