నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇటీవల కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థులు తీవ్రమైనం జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలనొప్పి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మెస్‌లో వడ్డించిన సాంబార్‌లో పిండిముద్దలు రావడంతో విద్యార్థులు మరోసారి ఆందోళన చెందారు. ఈ వీడియోలను షోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆహారం విషయంలో నాణ్యత పాటించడం లేదని మండిపడ్డారు. మెస్ కాంట్రాక్టర్లను రద్దు చేసి కొత్త వారిని రప్పించాలని కోరారు.