జర్మనీ, ఫ్రాన్స్ , బ్రిటన్, ఇటలీ లాంటి యూరోపియన్ దేశాలు.. సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలలో ఫార్మసిస్టులకు పెద్దపీట వేస్తారు. ఆయా దేశాల్లో రోగి వ్యాధిని గుర్తించి, ఔషధాన్ని సిఫారసు చేసే అధికారం ఫార్మసిస్టుకు ఉంటుంది. కానీ మన దేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఫార్మసిస్టుకు, వైద్యునికి మధ్య అసలు సంబంధమే ఉండదు. అటువంటి వ్యవస్థే ఇక్కడ ఉనికిలో లేదు. ఔషధాన్ని సరైన విధానంలో, సరైన మోతాదులో వినియోగిస్తేనే రోగి త్వరితగతిన కోలుకునే అవకాశాలు ఉంటాయి.