ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ

54చూసినవారు
ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్  పోస్టుల భర్తీ
TSRTC త్వరలో 2వేల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్ మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోందట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.