30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి.. వరుడు కావాలంటూ ప్రకటన

1070చూసినవారు
30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి.. వరుడు కావాలంటూ ప్రకటన
ఎక్కడైనా వివాహ వయసు వచ్చిన కూతురికి పెళ్లి సంబంధాలను చూడడం సాధారణమే. మ్యారేజ్ బ్యూరో, పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా పెళ్లి కొడుకులను వెతుకుతుంటారు. కొన్నిసార్లు న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇస్తుంటారు. అయితే కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ కుటుంబం 30 ఏళ్ల క్రితం మరణించిన తమ కుమార్తె కోసం మరణించిన పెళ్లి కుమారుడు కావాలని పేపర్​లో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట చర్చనీయాంశమైంది.