హైదరాబాద్‌లో తాగుబోతు వీరంగం (వీడియో)

83చూసినవారు
హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఆదివారం రాత్రి నడిరోడ్డుపై ఓ యువకుడు హల్ చల్ చేశాడు. తాగిన మత్తులో రోడ్డుపై వచ్చే పోయే వారిని దుర్భాషలాడుతూ.. నానా రభసా చేశాడు. అటుగా వెళ్తున్న పెట్రోల్ వాహనంలో నుంచి కానిస్టేబుల్ ఏం జరిగిందని అడగగా.. అతనిపై కూడా బూతుపురాణం మొదలు పెట్టాడు. అంతేగాక పక్కనే రాయి తీసుకుని కారులో ఉన్న పోలీస్ అధికారిపై విసిరే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్