డీఎస్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి: వెంకయ్య నాయుడు

77చూసినవారు
డీఎస్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి: వెంకయ్య నాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. డీఎస్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. డీఎస్‌ మృతి చెందారని తెలిసి చాలా బాధ పడ్డానన్నారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని ప్రజలు కోల్పోయారని, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి డీఎస్ ఏ మాత్రం గర్వం లేకుండా అందర్నీ కలుపుకుపోయేవారన్నారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.