పాకిస్తాన్ కు ఇండియా నోటీసులు పంపింది. సింధు నదీజలాల ఒప్పందంలో మార్పులు చేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1960 నాటి ఒప్పందాన్ని కొనసాగించటం కుదరదని తేల్చి చెప్పింది. ఈ నోటీసులో ఇండియాలో పెరుగుతున్న నీటి అవసరాలు, క్లీన్ ఎనర్జీ ఆవశ్యకత గురించి ప్రస్తావించింది. అంతే కాకుండా తీవ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసింది.