ఆ వ్యాఖ్యలు సరికాదు: సీఎం ఫడ్నవీస్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ‘దేశంలోని అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబై సురక్షితమైంది. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయనేది వాస్తవమే. వాటిని తీవ్రంగా పరిగణించాలి. కానీ, ఒక్క సంఘటనను ఆధారంగా చేసుకుని ముంబై సురక్షితమైన ప్రాంతం కాదని ప్రచారం చేయడం సమంజసం కాదు’ అన్నారు.