భార్య మద్యం సేవించడం క్రూరత్వం కాదు: అలహాబాద్ హైకోర్టు

71చూసినవారు
భార్య మద్యం సేవించడం క్రూరత్వం కాదు: అలహాబాద్ హైకోర్టు
తన భార్య మద్యం సేవిస్తుందని ఆరోపిస్తూ విడాకులు ఇప్పించమని ఓ భర్త కోరిన కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి మద్యం సేవించడం హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం, వివాహాన్ని రద్దు చేసేంత క్రూరత్వం కాదని చెప్పింది. తన భార్య క్రూరత్వం కారణంగా విడాకుల కోసం చేసుకున్న అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో భర్త అప్పీల్ చేసుకోగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్