గుమ్మడి కాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పక్షవాతం ముప్పు తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా గుమ్మడి కాయ బాగా ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గుమ్మడి కాయ బాగా ఉపయోగపడుతుంది.