కొర్రలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలకు కొర్రలు గొప్ప మూలం. కొర్రలలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దీంతో షుగర్ పేషెంట్లకు చాలా మేలు కలుగుతుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయని సూచిస్తున్నారు.