శీతాకాలంలో బట్టలు ఆరేందుకు చాలా టైం పడుతుంది. అయితే అర్జంట్‌గా పని మీద బయటికెళ్లేటప్పుడు బట్టలు త్వరగా ఆరాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అయితే తడి బట్టలను సులువుగా ఆరబెట్టుకోవచ్చు. ముందుగా బెడ్‌పై షీట్‌ను పరచి దానిపై వాషింగ్ మిషిన్ నుంచి తీసిన బట్టలు వేయండి. తర్వాత పైన షీట్ వేసి రూం హీటర్ ఆన్ చేసి గదిని మూసేయండి. ఇలా చేస్తే బట్టలు కొన్ని నిమిషాల్లోనే ఆరిపోతాయి. అలాగే హెయర్ డ్రయ్యర్ యూజ్ చేసి కూడా త్వరగా ఆరబెట్టుకోవచ్చు.