పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఫేక్ న్యూస్.. స్పందించిన EC

69చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఫేక్ న్యూస్.. స్పందించిన EC
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయరాదని వాట్సాప్‌లో మెసేజ్ చక్కర్లు కొడుతుండగా.. ఈసీ దీనిపై స్పందించింది. ఇది తప్పుడు సమాచారం అని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని పేర్కొంది.