కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ధ్వజం

64చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ధ్వజం
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులకు ఒక్క మంత్రి కూడా భరోసా ఇవ్వడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే.. కాంగ్రెస్ నేతలు రాజకీయ గేట్లు ఎత్తామని అంటున్నారని ధ్వజమెత్తారు. ’మీకు రైతుల మీద అంతలా ప్రేమ ఉంటే మాకన్నా ఎక్కువ పంట నష్టపరిహారం ఇచ్చి చూపాలి‘ అని సవాల్ విసిరారు.