సగానికిపైగా ఆస్తిని విరాళంగా ఇస్తా: ఆల్ట్‌మన్

81చూసినవారు
సగానికిపైగా ఆస్తిని విరాళంగా ఇస్తా: ఆల్ట్‌మన్
ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంపదలో 50శాతానికిపైగా విరాళం ఇస్తామని, ఆయన పార్ట్‌నర్ ఓలివర్ ‘గివింగ్ ప్లెడ్జ్’ ద్వారా ప్రమాణం చేశారు. సమాజానికి తమ వంతు సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. టెక్నాలజీతోనూ సమాజ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేస్తామని తెలిపారు. మెలిందా గేట్స్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ‘గివింగ్ ప్లెడ్జ్’ ద్వారా ఎందరో సంపన్నులు విరాళాలను ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్