పెండింగ్‌ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు (వీడియో)

63చూసినవారు
TG: పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. ఈ మేరకు చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైన మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్