AP: ఈ నెల 9న విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రారంభం కానుంది. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఉన్న అనుకూలతపై ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులను ప్రారంభిస్తారు.