దీపావళి బాణాసంచా పేలుళ్ల తర్వాత శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీని పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఢిల్లీలో బాణసంచా నిషేధం ఉన్నప్పటికీ గురువారం(అక్టోబర్ 31) రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. ఈ మేరకు రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) శుక్రవారం ఉదయం 395గా నమోదైంది. ఈ గాలి పీల్చుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు.