తీవ్ర అల్పపీడనం.. అత్యంత భారీ వర్షాలు

2617చూసినవారు
తీవ్ర అల్పపీడనం.. అత్యంత భారీ వర్షాలు
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింద‌ని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ములుగు, భద్రాద్రి, ఖమ్మం, MABD జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. HYD, కుమురం భీం, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ప‌డతాయ‌ని పేర్కొంది.

సంబంధిత పోస్ట్