ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

55092చూసినవారు
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఫ్లైఓవర్ పై డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్థారించారు. అత్యంత వేగంగా డీసీఎంను ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు నవీద్(25), నిఖిల్ రెడ్డి(25), రాకేష్(25)గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్