TG: ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై మహిళా అఘోరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్ పోర్ట్ కాలనీ నవగ్రహ విగ్రహాల ధ్వంసం చేయడాన్ని పరిశీలించారు. ఆలయాలపై దాడులు, మహిళలను హత్యలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. దాడులను పట్టించుకోని అధికారులు తనని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 'ఎక్కడికైనా వెళ్తా.. గోహత్యలపై మహిళలపై దాడులను ఎదిరిస్తా. ఎవరు ఏం చేస్తారో చూస్తా' అని అన్నారు.