గుండె జబ్బులు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని WHO, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 1946లో జెనీవాలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో తొలిసారిగా వరల్డ్ హార్ట్ డే నిర్వహించారు. 'యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్' అనే థీమ్‌తో ఈ ఏడాది దినోత్సవాన్ని నిర్వహించారు.