సాయుధ గ్రూపుల మధ్య కాల్పులు.. ఒకరు మృతి!

65చూసినవారు
సాయుధ గ్రూపుల మధ్య కాల్పులు.. ఒకరు మృతి!
మణిపూర్‌లోని కాంగ్ పోక్పి జిల్లాలో రెండు సాయుధ గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక వాలంటీర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సతాంగ్ కుకీ కొండ నుంచి గ్రామంలోకి ప్రవేశించిన సాయుధులు బాంబు దాడి చేయడంతో ఘర్షణ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you