బ్రిటిష్ వారిని గడగడలాడించిన కొందరు భారత స్వాతంత్య్ర సమరయోధులకు సరైన గుర్తింపు దక్కలేదు. అలాంటి వారిలో 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన ఖదీరామ్ బోస్, అప్పటి పంజాబ్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓడ్వైర్‌ను చంపిన ఉధమ్ సింగ్, భగత్ సింగ్‌తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు పెట్టిన బతుకేశ్వర్ దత్, వైస్రాయ్ లార్డ్ కర్జన్ విల్లీని హత్య చేసిన మదన్ లాల్ ధింగ్రా, స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ సాహిత్యాన్ని రాసి, ప్రచురించిన భికాజీ కామా వంటి వారు అజ్ఞాత హీరోలుగా మిగిలిపోయారు.