ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇవాళ భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి కావడం వల్ల ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారత్ సహా విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. చలికాలం కావడం వల్ల గడ్డకట్టే స్థితిలో నీరు ఉన్నప్పటికీ విదేశీ భక్తుల బృందం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు.